ఒమన్ ఎయిర్ ప్రయాణికులకు కాంప్లిమెంటరీగా కోవిడ్ 19 భీమా సదుపాయం
- October 05, 2020
మస్కట్:ఒమన్ వెళ్లే ప్రయాణికులకు ఇక క్వారంటైన్ ఖర్చుల గురించి దిగులు అక్కర్లేదు. ఒమన్ ప్రభుత్వ విమానయాన సంస్థ ఒమన్ ఎయిర్ తమ ప్రయాణికులు అందరికీ ఉచితంగా కోవిడ్ 19 బీమా సదుపాయం కల్పిస్తోంది. కాల్ సెంటర్, బుకింగ్ కౌంటర్స్ లేదా ఏజెంట్ల దగ్గరైనా సరే ఒమన్ ఎయిర్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లందరికీ కోవిడ్ 19 కవరేజ్ ను కాంప్లిమెంటరీగా అందించనుంది. ఆక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భీమా సదుపాయం అందుబాటులో ఉంటుంది. టికెట్ షెడ్యూల్ గడువు ప్రారంభమైన క్షణం నుంచి ప్రయాణికులు భీమా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఒకవేళ ప్రయాణ సమయంలో వైరస్ బారిన పడినా చికిత్స ఖర్చును బీమా ద్వారా చెల్లించుకోవచ్చు. అలాగే క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం వస్తే ఆ ఖర్చులకు కూడా బీమా ద్వారా చెల్లించొచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రయాణికులు అందరికీ కవరేజ్ వర్తిస్తుంది. ప్రయాణికుల భద్రతకు తమ సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తోందని..కోవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాస్కులు అందించటంతో పాటు విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు భౌతిక దూరం పాటించటం, జర్నీ తర్వాత విమానంలో ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్షన్ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదిలాఉంటే..ఒమన్ కు వచ్చే ప్రయాణికులు..ఒమన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు..కోవిడ్ నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకు http://paca.gov.om వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు కోరారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







