తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
- October 05, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1335 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. ఆదివారొ ఒక్కరోజే 8 మంది వైరస్ బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1171 కు చేరింది. అయితే, కోవిడ్ బాధితుల రికవరీ రేటు తెలంగాణలో 85.93 శాతానికి పెరగడం శుభ పరిణామం. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2176 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,72,388. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 27,052. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. ఇక దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉండగా తెలంగాణలో 0.58 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,348 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 32,41,597 కు చేరిందని వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







