క్వారంటైన్ స్టాంప్‌లతో ఇన్‌ఫెక్షన్: మధుయాష్కి

- October 05, 2020 , by Maagulf
క్వారంటైన్ స్టాంప్‌లతో ఇన్‌ఫెక్షన్: మధుయాష్కి

న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా భయంతో సతమవుతుంటే ఇప్పుడు మరో సమస్య తెరపైకి వచ్చింది. అదే ఎయిర్ పోర్టులో వేస్తున్న క్వారంటైన్ స్టాంప్‌లు. ఇవి వికటిస్తున్నాయా అనేది ప్రస్తుత సమస్య. స్టాంప్‌కు వినియోగిస్తున్నవాట్లో ఏ రసాయనాలు వాడుతున్నారు? వాటితో చర్మ వ్యాధులు వస్తున్నాయా? ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధానకార్యదర్శి మాధుయాష్కి గౌడ్ చేసిన ట్వీట్‌తో.. స్టాంప్‌లతో సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో చేతిపై వేస్తున్న క్వారంటైన్ స్టాంపులు వికటిస్తున్నాయని, తన చేతికి ఇన్‌ఫెక్షన్ సోకిందంటూ మాధుయాష్కి ట్వీట్ చేశారు. గత శనివారం స్టాంప్ వేయగా ఇన్‌ఫెక్షన్ వచ్చిందంటూ ఫోటోలు తీసి ట్విట్టర్ వేధికగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్టాంప్‌ల్లో వాడే రసాయనాలను పరిశీలించాలని కోరారు.

మధుయాష్కి ట్వీట్‌పై కేంద్రమంత్రి స్పందించారు. స్టాంప్‌లతో ఇన్‌ఫెక్షన్ సోకుతుందని తన దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్ పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియా సీఎమ్డీతో ఇదే విషయంపై చర్చించినట్లు హర్దిప్ సింగ్‌ బదులిచ్చారు. కేంద్రమంత్రి తక్షణ స్పందనకు మధుయాష్కి కూడా ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com