భారత్ లో తగ్గిన కరోనా కేసులు
- October 06, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.. వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన చెందుతున్న సమయంలో.. గుడ్‌న్యూస్ చెబుతూ.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా కాస్త తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 61,267 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 884 మంది మృతిచెందారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,083కు చేరుకున్నాయి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,19,023 యాక్టివ్ కేసులు ఉండగా... 56,62,491 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 1,03,569 మంది మృతిచెందారు. మరోవైపు.. సోమవారం రోజు 10,89,403 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 8,10,71,797కు చేరినట్టు పేర్కొంది ICMR.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







