మస్కట్ నుంచి భారత్ లోని 6 నగరాలకు ఇండిగో విమాన సర్వీసులు
- October 06, 2020
మస్కట్:ఒమన్ నుంచి భారత్ కు విమాన సర్వీసులను నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే..ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన మేరకు మస్కట్ నుంచి భారత్ లోని 6 నగరాలకు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఒమన్-భారత్ మధ్య కుదిరిన బబుల్ అగ్రీమెంట్ అక్టోబర్ 1 నుంచి రెండు నెలలు అమలులో ఉంటుంది. దీంతో విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఇండిగో ఆక్టోబర్ 7 నుంచి సర్వీసులను స్టార్ట్ చేయనుంది. మస్కట్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబై, చెన్నై, కొచ్చి నగరాలకు విమానాలు నడపనుంది. ఒమనీయులతో పాటు ప్రవాసీయులు ఇండియా నుంచి మస్కట్ కు వెళ్లొచ్చు. అయితే..ఒమన్ జారీ చేసిన కోవిడ్ మార్గనిర్దేశకాల మేరకు ప్రతి ఒక్కరు మస్కట్ లో ల్యాండ్ అవగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మస్కట్ నుంచి ఇండియాకు కేవలం ప్రవాస భారతీయులను, ఒమన్ లో చిక్కుకుపోయిన ఇండియన్లను మాత్రమే అనుమతిస్తారు. అయితే..హోమంత్రిత్వ శాఖ పరిధిలో వీసాలు పొందిన ఒమనీయులు, దౌత్య కార్యాలయ అధికారులకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







