అగ్రిగోల్డ్ యజమానులకు 14 రోజుల రిమాండ్ ..
- February 12, 2016
సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఆ సంస్ధ యజమానులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిన్న రాత్రి అరెస్టయిన అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, సీఎండీ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణవులను ఈరోజు వేకువజామున పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తీసుకొచ్చారు.కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తీసుకువచ్చి, కోర్టు సమయం వరకు వేచి ఉంచారు. ఉదయం 10గంటల సమయంలో జిల్లా న్యాయమూర్తుల నివాస సముదాయానికి తరలించి, రెండో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ హరినాథ శర్మ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులిద్దరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏలూరు సబ్‌జైలుకు తరలించారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అగ్రిగోల్డ్ యజమానులను ఆసుపత్రికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ భయపడొద్దని, అందరికీ న్యాయం చేస్తాననిఈ సందర్భంగా అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకటరామారావు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







