ఒమ‌న్:ఆరోగ్య శాఖ‌లో కాస్ట్ క‌టింగ్‌...20% కంట్రాక్ట్ ఉద్యోగుల‌పై వేటు

- October 07, 2020 , by Maagulf
ఒమ‌న్:ఆరోగ్య శాఖ‌లో కాస్ట్ క‌టింగ్‌...20% కంట్రాక్ట్ ఉద్యోగుల‌పై వేటు

మస్కట్:కోవిడ్ 19 ప్ర‌బ‌లుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఒమ‌న్ ప్ర‌భుత్వ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్య శాఖ‌లో పొదుపు చర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌పంచ దేశాలన్ని వైర‌స్ ను క‌ట్ట‌డి చేసేందుకు వైద్య రంగానికి ప్ర‌త్యేక నిధులు కేటాయిస్తుంటే..ఒమ‌న్ మాత్రం అందుకు బిన్నంగా వైద్య ఆరోగ్య శాఖ‌లో కాస్ట్ క‌టింగ్ చ‌ర్య‌ల‌ను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆస్ప‌త్రుల్లో క్లీనింగ్ సిబ్బందికి సంబంధించి 20% ఉద్యోగుల‌ను తొల‌గించ‌నుంది. అలాగే 20% టెక్నిషియ‌న్ల కాంట్రాక్ట్ ను కూడా ర‌ద్దు చేసుకోవాల‌ని నిర్ణ‌‌యించింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యాల‌యాల్లో సెక్యూరిటీ గార్డుల సంఖ్య‌ను త‌గ్గించాల‌ని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని అడ్మినిస్ట్రేటీవ్‌, ఫైనాన్స్ అండ‌ర్ సెక్రెట‌రీ ఆదేశాలు జారీ చేశారు. అద్దె వాహ‌నాల కాంట్రాక్టుల‌ను కూడా 20-25% మేర త‌గ్గించి..వాటి స్థానంలో ట్రిప్పుల వారీగా అద్దె చెల్లించాల‌ని అధికారులు ఆదేశించారు. అలాగే ఆస్ప‌త్రుల్లో ప్ర‌స్తుతం వాడుతున్న నీరు, క‌రెంట్ వాడ‌కాన్ని కూడా 20-30 శాతం వ‌ర‌కు త‌గ్గించాల‌ని సూచించారు. ఫ‌ర్నిచ‌ర్ కొనుగోలు, రిపేర్ చేయించే ప‌నుల‌పై కూడా ఆంక్ష‌లు విధించారు. గార్డెనింగ్ కంట్రాక్ట్ ల‌ను ర‌ద్దు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com