దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఇంటికి చేరుకునేందుకు అనుమతి

- October 08, 2020 , by Maagulf
దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఇంటికి చేరుకునేందుకు అనుమతి

దుబాయ్: 300 మందికి పైగా ప్రయాణీకులు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో బుధవారం మధ్యాహ్నం చిక్కుకుపోగా, వారందరికీ దేశంలోకి ప్రవేశం కల్పిస్తూ అథారిటీస్‌ నిర్ణయం తీసుకున్నాయి. జనరల్‌ డైర్టెరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ ఎఫైర్స్‌, ఎయిర్‌పోర్ట్‌ పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీకి చెందిన అధికారులు ఓ బృందంగా ఏర్పడి, చిక్కుకుపోయిన ప్రయాణీకుల్ని వారి ఇళ్ళకు పంపే ఏర్పాట్లు చేశారు. పాలసీ అప్‌డేట్‌ నేపథ్యంలో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. కొత్త రూల్‌ ప్రకారం, ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే ప్రయాణికులు ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ నుంచి ప్రీ అప్రూవల్‌ పొందాల్సి వుంది. దుబాయ్‌లో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ - కాన్సుల్‌ ఫర్‌ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కల్చర్‌ నీరజ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, 290 మంది ఫ్లై దుబాయ్‌ ఇండియన్‌ ప్రయాణీకులు వారి వారి ఇళ్ళకు చేరుకున్నట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com