1,30,000 దిర్హామ్‌ల విజిట్ వీసా స్కామ్
- February 12, 2016
వీసా స్కామ్‌లో ఇద్దరు పాకిస్తానీలపై నేరం నిరూపితమయ్యింది. 25 మందికి వీసాలను మంజూరు చేస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరిని న్యాయస్థానం దోషులుగా తీర్పునిచ్చింది. వారికి విధించబోయే శిక్షపై మార్చ్ 9న నిర్ణయం వెలువడుతుంది. పాకిస్తానీ సెక్యూరిటీ ఆఫీసర్, తన వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులకు వీసా ఇప్పించేందుకు ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం 1,30,000 ఖర్చవుతుందని వారు చెప్పారు. తొలి విడతగా 45,000 దిర్హామ్‌లు చెల్లించాడు పాకిస్తానీ సెక్యూరిటీ ఆఫీసర్. మిగతా మొత్తం కూడా కొన్నాళ్ళ తర్వాత వారికి చెల్లించడం జరిగింది. వీసాలను కొద్ది రోజులలోనే ఇస్తామని చెప్పి, ఆ తర్వాత నిందితులు తప్పించుకుపోయారు. నిందితులు ఇచ్చిన డాక్యుమెంట్ ఫోర్జరీగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నిర్ధారించింది. ఈ కేసులో పోలీసులు 59 ఏళ్ళ బిజినెస్ మెన్, 23 ఏళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ని ఈ కేసులో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







