సలాహ్ ప్రాంతాల్లో సముద్ర ముంపు ప్రమాదం
- February 12, 2016
భవిష్యత్తులో ఐదు మీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లయితే సలాహ్ ప్రాంతాల్లో చాలావరకు నీటిలో మునిగిపోతాయని ఇటీవల నిర్వహించిన ఓ స్టడీ పేర్కొంది. సియోమాటిక్స్ స్పెలిస్ట్ అమోల్ జి దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, స్టడీ కోసం సలాహ్ ప్రాంతాల్ని పరిశీలించామనీ, చాలా వరకు రిసార్టులు, హోటళ్ళు తీర ప్రాంతంలో నిర్మించబడ్డాయనీ, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టులు సునామీ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటినుంచే అవగాహన పెంచుకోవాలని ఆయన చెప్పారు. ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పరిస్థితుల్ని అంచనా వేశారు. నేషనల్ సర్వే అథారిటీ ఈ వివరాల్ని అందరికీ అందుబాటులో ఉంచిందని దేశ్‌ముఖ్ వివరించారు. వరదలు సంభవించినప్పుడు సుల్తానేట్‌లో డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందికరంగా మారుతుందనీ, దీని విషయంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవలసి ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







