సమంత కొత్త రెసిపీ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్
- October 09, 2020
హైదరాబాద్:ఉపాసన కొణిదెల "యువర్ లైఫ్" వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా
వ్యవహరిస్తున్న ప్రముఖ నాయిక సమంత కొత్త కొత్త రెసిపీలను వ్యూయర్స్ కు
పరిచయం చేస్తున్నారు. "స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్" సెక్షన్ లో హెల్దీ
అండ్ టేస్టీ వంటలతో ఆమె మంచి చెఫ్ అనిపించుకుంటున్నారు. ఉపాసనతో కలిసి
సమంత చేస్తున్న రుచికరమైన వంటలతో పాటు వంటలు చేస్తున్నప్పుడు వారిద్దరి
సరదా సంభాషణ మరింత ఆకర్షిస్తోంది.
"స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్" లో సమంత వేగాన్ ఫిల్టర్ కాఫీ చాక్లెట్
చియా సీడ్ పుడ్డింగ్ చేశారు. ఇందుకు కొబ్బరి పాలు, డార్క్ కొకోవా పొడి,
ఫిల్టర్ కాఫీ డికాక్షన్, వెనీలా, మాపుల్ సిరప్ లేదా బెల్లం సిరప్, సబ్జా
గింజలను కలిపి రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా చాలు సులువైన రుచికరమైన
రెసిపీ తయారు చేశారు సమంత. మరుసటి రోజు ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్
రుచి చూడటం ప్రారంభించి గ్లాస్ లో ఉన్న ఫుడ్డింగ్ మొత్తం తినేసేదాక
ఆపలేదు సమంత. అంత రుచిగా ఆమెకు నచ్చిందా రెసిపీ. ఈ సందర్భంగా ఉపాసనతో
మాట్లాడుతూ..తాను ఫూర్ వెజిటేరీయన్ అని తెలిపింది సమంత.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







