భారత విద్యార్థులను ఆకర్షించడానికి యుకే!
- February 12, 2016
భారత విద్యార్థులను ఆకర్షించడానికి యుకే(యునైటేడ్ కింగ్డమ్) ప్రభుత్వం ఉపకార వేతనాలను పెంచింది. గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యుకే ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఉండే బోగస్ కాలేజీలన్నింటినీ తొలగించామని, ఇప్పుడు గుర్తింపు పొందిన కాలేజీలు మాత్రమే ఉన్నాయని మినిష్టర్ కౌన్సిలర్(పోలిటికల్,ప్రెస్) ఆఫ్ బ్రిటిష్ హై కమిషన్ ఆండ్రూ సోపర్ గురువారం విలేకరులకు తెలిపారు.గ్రేట్ బ్రిటన్ పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులకు 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ అందిస్తున్నామని తెలిపారు. యుకేలో చదువాలనుకునే భారత విద్యార్థుల కోసం విసాను కూడా సులభతరం చేశామని చెప్పారు.పదిమంది విద్యార్థుల్లో తొమ్మిది మందికి విసా వచ్చేలా చేస్తున్నామని యుకే ప్రభుత్వం తెలియజేసింది. భారతదేశంలో ఉన్న ముఖ్యమైన మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజనీరింగ్ కోర్సులుకూడా ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది భారత విద్యార్థులు 20వేల మంది వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నారని, వారికి రూ. 49 కోట్లు స్కాలర్షిప్లు అందుతున్నాయని బ్రిటిష్ కౌన్సిల్ ఇండియన్ డెరైక్టర్ రోబ్ లైన్స్ తెలిపారు. అయితే, 2013లో భారత విద్యార్థులు 24,000 మంది బ్రిటన్‌లో చదువుకున్నారని చెప్పారు. బ్రిటన్‌కు చెందిన వెయ్యిమంది విద్యార్థులు భారత్‌లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







