సంసారాన్ని...సముద్రంలో ముంచేసిన తండ్రి
- February 12, 2016
సిరియన్ దేశానికి చెందిన ముద్దులొలికే బుడతడు బూటుకాళ్ళతో బొక్కబోర్లాగా ఇసుకలో కూరికుపోయి చనిపోయిన హృదయవిదారమైన ఫోటో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నిర్ఘాంతపరచింది . ఇసిస్ ఉగ్రవాదుల చర్యలకు భీతిల్లిన నేపధ్యంలో అబ్దుల్లా కుర్ది తన భార్య రిహన, ఇరువురు కుమారులు అబ్దుల్లా ఘలేబ్ (4) , అయ్లన్ కుర్ది (3) కుటుంబంతో సహా నాటు పడవలో గ్ర్రేసు దేశానికి పారిపోతూ ప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోయారని అంతా భావించారు. మృతి చెందిన ఐదుగురులో మరో ఇరువురు వేరేవారు కాగా, తండ్రి అబ్దుల్లా కుర్ది సముద్రంలో ఈదుకొంటూ బతికినట్లు మీడియా కధనాలను ప్రచురించింది. కాగా ఈ తండ్రి ఎక్కువ మొత్తంలో కిరాయి తీసుకొని మనుష్యులను సిరియా నుంచి అక్రమంగా పలు ప్రాంతాలకు రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్ల బృందంలో ఒక ముఖ్య సభ్యుడని టర్కీ పోలీసులు విచారణలో తేలింది. ఈ నేరారోపణ రుజువైతే నాటుపడవతో కుటుంబంను చేజేతులారా చంపుకొన్న అబ్దుల్లా కుర్ది, మరో ఇద్దరు స్మగ్లర్లకు టర్కీ కోర్టు కనీసం 35 ఏళ్ళ జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







