దుబాయ్:తప్పతాగి అరబ్ మహిళను వాటేసుకున్న అఫ్రికన్...కోర్టులో విచారణకు వచ్చిన కేసు
- October 11, 2020
దుబాయ్:ఓ 40 ఏళ్ల ఆఫ్రికన్..తప్పతాగి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను బలవంతంగా కౌగిలించుకొని వేధించాడు. దుబాయ్ పబ్లిక్ పార్కులో గత ఆగస్ట్ 25న ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో అల్ రషిదియా పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు ఇప్పుడు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా అఫ్రికన్ తన పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో..అతని చర్యల వల్ల తాను మానసికంగా ఎంత ఇబ్బంది పడిందో బాధితురాలు కోర్టుకు వివరించింది. తన భుజంపై చేయి వేసి బలవంతంగా కౌగిలించుకున్నాడని కోర్టుకు వివరించింది. ఆ సమయంలో అతను తప్పతాగి ఉన్నాడని తెలిపింది. ఓ పాకిస్తానీ కూడా నిందితుడు అరబ్బీ మహిళ పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. అటు నిందితుడు కూడా బాధితురాలి భుజం పట్టుకొని లాగినట్లు, ఆమె భుజంపై తలవాల్చినట్లు దర్యాప్తు సమయంలో ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇరువైపు వాదనల అనంతరం తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







