కోవిడ్ 19: ఒమన్ లో పాక్షిక కర్ఫ్యూ..మస్కట్-సలాహ్ బస్సు సర్వీసులు రద్దు
- October 11, 2020
మస్కట్:దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆక్టోబర్ 11 నుంచి 24 వరకు నైట్ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని పబ్లిక్ ప్లేసులు, షాపులు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయాలని ఆదేశించింది. లాక్డౌన్ అమలులో సమయంలో ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించింది. నైట్ లాక్డౌన్ అమలులోకి రావటంతో..ప్రజా రవాణా వ్యవస్థల టైమింగ్స్ ను రీషెడ్యూల్ చేశారు. మస్కట్-సలాహ్ మధ్య బస్సు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఒమన్ జాతీయ రవాణా సంస్థ ఎంవసలాత్ తెలిపింది. ఇక మస్కట్ సిటీ, ఇంటర్ సిటీ(సలాహ్ మినహా) సర్వీసులు సాయంత్రం 6 గంటలలోగా గమ్యస్థానాలకు చేరుకుంటాయని, అలాగే నేషనల్ ఫెర్రీస్ కూడా సాయంత్రం 6 గంటల వరకే ఉంటాయని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాక్షిక లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







