ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా
- October 11, 2020
అమరావతి: ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 7,55,727కు కరోనా కేసులు చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,224 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 46,295 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,03,208 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 65.69 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. ప్రకాశం 8, చిత్తూరు 4, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో, గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







