వీసా గడువు ముగిసిన యూఏఈ నివాసితులకు కీలక సూచన
- October 12, 2020
యూఏఈ:మహమ్మారి కరోనా నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసా ఎక్స్పైర్డ్ అయిన వారు అక్టోబర్ 10లోపు రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం 3 నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 10తో ఈ గడువు ముగిసింది కనుక ఇకపై వీసా గడువు ముగిసిన నివాసితులు దేశంలో ఉంటే భారీగా ఓవర్ స్టే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 11తో వీసా గడువు ముగిసిన నివాసితులకు ఈ ఓవర్ స్టే జరిమానాలు వర్తిస్తాయని ఎమిరేట్‌లోని అమిర్ సెంటర్ ఉద్యోగులు, వీసా కన్సల్టెంట్స్ స్పష్టం చేశారు.
ఇక ఓవర్ స్టే జరిమానా కింద తొలిరోజు 125 దిర్హాములు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండో రోజు నుంచి ప్రతిరోజు 25 దిర్హాములు జరిమానా ఉంటుందని తెలిపారు. కాగా, వీసా దరఖాస్తుదారులలో అధికంగా భారతీయులతో పాటు పాకిస్తానీలు, ఈజిప్టియన్స్, ఫిలిప్పీనోస్ ఉన్నట్లు షార్జా లోని ASAT ట్రావెల్స్ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ కుమార్ కొవ్వూరి తెలియజేశారు.వీరిలో చాలా మంది ఉద్యోగార్ధులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్‌లో టీసీఎస్‌తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









