కువైట్:NRI నుంచి సలహాలు, సూచనలు కోరిన భారత రాయబార కార్యాలయం
- October 12, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ప్రవాస భారతీయులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎన్ఆర్ఐలను సలహాలు కోరింది కువైట్ లోని భారత రాయబార కార్యాలయం. దౌత్య సంబంధ అంశాలతో పాటు భారతీయుల సంక్షేమానికి సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అధికారులు కోరారు. ఇందుకోసం కువైట్ భారత రాయబార కార్యాలయంతో పాటు మూడు పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ పేపర్లను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ లోనే ఫీడ్ బ్యాక్ పేపర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే మరన్ని భాషల్లో పేపర్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కువైట్ లోని ప్రవాస భారతీయులు పేపర్లలో తమ ఫీడ్ బ్యాక్ కు, సలహాలను రాసి రాయబార కార్యాలయం రిసిప్షన్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలని తెలిపారు. అలాగే పాస్ పోర్ట్ కేంద్రాల్లోనూ బాక్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే [email protected] ద్వారా కూడా ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







