ఒమన్ లో అమలులోకి వచ్చిన 14 రోజుల పాటు పాక్షిక లాక్డౌన్
- October 12, 2020
మస్కట్:కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఒమన్ సుప్రీం కమిటీ దేశంలో విధించిన పాక్షిక లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఆక్టోబర్ 11 నుంచి 24 వరకు 14 రోజుల పాటు నైట్ లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఈ 14 రోజుల పాటు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పబ్లిక్ ప్రాంతాలు, షాపులు మూసివేయాలని సుప్రీం కమిటీ ఆదేశించింది. లాక్డౌన్ అమలులో సమయంలో ఎవరూ బయటికి రావొద్దని రాయల్ ఒమన పోలీసులు హెచ్చరించారు. నైట్ లాక్డౌన్ అమలులోకి రావటంతో..ప్రజా రవాణా వ్యవస్థల టైమింగ్స్ ను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. మస్కట్-సలాహ్ మధ్య బస్సు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఒమన్ జాతీయ రవాణా సంస్థ ఎంవసలాత్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇక మస్కట్ సిటీ, ఇంటర్ సిటీ(సలాహ్ మినహా) సర్వీసులు సాయంత్రం 6 గంటలలోగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







