దుబాయ్ షాపింగ్ మాల్స్ లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల కేంద్రాల ఏర్పాటు
- October 13, 2020
దుబాయ్:కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఇక ఆస్పత్రులు, ల్యాబ్ ల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంది దుబాయ్ ఆరోగ్య శాఖ. ప్రయాణికులు, ఇతర అవసరాల కోసం మెడికల్ ప్రూఫ్ గా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అయిన వారు ఇక నుంచి దుబాయ్ షాపింగ్ మాల్స్ లోనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. దుబాయ్ లోని మూడు షాపింగ్ మాల్స్ లో ఈ వెసులుబాటు కల్పించారు. మాల్ ఆఫ్ ది ఎమిరాతి, మిర్దిఫ్ సిటీ సెంటర్, దైరా సిటీ సెంటర్ లో ఏర్పాటు చేసిన పీసీఆర్ టెస్ట్ సెంటర్స్ లో వారంలో ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు Dh150 చెల్లించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్ట్ చేయించుకునేవారు దుబాయ్ హెల్త్ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్ 800DHA (800342)కి కాల్ చేసి ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే..జ్వరం ఉన్నా..ఇతర కోవిడ్ లక్షణాలు ఉన్నా షాపింగ్ మాల్స్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో టెస్ట్ చేయించుకునేందుకు అనుమతించరు. షాపింగ్ మాల్స్ లో ఏర్పాటు చేసిన కేంద్రాలు కేవలం ప్రయాణం కోసం లేదా తమకు కరోనా సోకలేదని మెడికల్ ప్రూఫ్ గా పీఆసీఆర్ టెస్ట్ ఫలితాలు తప్పనిసరి అయినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో టెస్ట్ సెంటర్ లో రోజుకు 180 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. 24 గంటల్లోగా రిపోర్ట్ ఇస్తారు. అత్యవసరంగా ప్రయాణం చేసేవారికి దుబాయ్ షాపింగ్ మాల్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయి.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







