షార్జా:ఫ్యామిలీ ఏరియాస్ నుంచి బ్యాచిలర్స్, వర్కర్స్ తొలగింపు
- October 16, 2020
షార్జా:షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్) ఆదేశాల మేరకు, షార్జా సిటీ మునిసిపాలిటీ, శుక్రవారం నుంచి బ్యాచిలర్స్ అలాగే వర్కర్స్‌ని ప్యామిలీ కోసం నిర్దేశించిన ప్రాంతాల నుంచి తొలగించనున్నారు. ఫ్యామిలీస్ భద్రతని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టనున్నారు. అల్ కాసిదియా ప్రాంతంలో మునిసిపాలిటీ క్యాంపెయిన్ నుంచి ఇది కొనసాగింపుగా వస్తోంది. షార్జా పోలీస్, షార్జా ఎలక్ట్రిసిటీ వాటర్ అండ్ గ్యాస్ అథారిటీ సహకారంతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నారు. ఫ్యామిలీస్ కోసం కేటాయించిన ఇళ్ళలో నిబంధనలకు విరుద్ధంగా వుంటోన్నవారిని ఆయా ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు పంపేలా ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనులకు వెంటనే ఆయా సర్వీసుల్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







