TCS NQT నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ప్రకటన..
- October 16, 2020
టీసీఎస్ అనుబంధ సంస్థ అయిన టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (NQT) ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా పలు కార్పొరేట్ సంస్థల్లో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అభ్యర్థులకు పరీక్షలో వచ్చిన స్కోర్‌కు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఇంటి నుంచి పరీక్ష రాసే అవకాశం ఉంది. ఒకవేళ పరీక్షకు అవసరమైన సౌకర్యాలు లేకుంటే దగ్గరలోని టీసీఎస్ అయాన్ సెంటర్లలో పరీక్ష రాయవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్‌క్యూటీ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం.. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 17 పరీక్ష తేదీలు: అక్టోబర్ 24,25,26 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పత్రాలు: పరీక్షకు రెండు రోజుల ముందు అభ్యర్థుల ఈ-మెయిల్‌కు అందుతాయి. అర్హతలు: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, డిగ్రీ వీటిలో ఏదైనా కోర్సు ఫుల్ టైమ్ విధానంలో చివరి ఏడాది చదువుతున్నవారు (2021లో పూర్తి చేయనున్నవారు) అర్హులు. ఇంజనీరింగ్ అన్ని బ్రాంచ్‌లూ, ఎమ్మెస్సీ అన్ని విభాగాల వారూ ఈ పరీక్ష రాయవచ్చు. అయితే సంబంధిత కోర్సులను రెగ్యులర్ విధానంలో చదివి ఉండాలి. పది, ఇంటర్ మాత్రం ఓపెన్ స్కూల్ విధానంలో చదివినప్పటికీ అర్షులే.
అకడమిక్ మార్కుల శాతం: పది, ఇంటర్/డిప్లొమా, యూజీ/పీజీ అన్నింటా కనీసం 60 శాత మార్కులు లేదా 6 సీజీపీఏ తప్పనిసరిగా ఉండాలి. బ్యాక్ లాగులు: ప్రస్తుతానికి ఒకటి కంటే ఎక్కువ ఉండరాదు. అదీ నిర్ధేశిత గడువులోగా పూర్తిచేయాలి. గ్యాప్‌లు: విద్యాభ్యాసం మొత్తం మీద రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండరాదు. అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉన్నవారి విషయంలో అందుకు బలమైన కారణం (అనారోగ్యం, ప్రమాదాలు.. మొదలైనవి) ఆధారాలతో సహా చూపించాల్సి ఉంటుంది. వెబ్సైట్: https://www.tcs.com/careers/TCSCampusHiringYoP2021రిజిస్ట్రేషన్‌కు డైరెక్ట్ లింక్: https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన