కీర్తిసురేష్‌కు 'మిస్ ఇండియా' యూనిట్ బర్త్‌డే విషెష్
- October 17, 2020
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు కీర్తి సురేష్. చక్కటి రూపం, హావభావాలు కీర్తి సొంతం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే కీర్తిసురేశ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మిస్ ఇండియా'. శనివారం(అక్టోబర్ 17) కీర్తిసురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తోంది 'మిస్ ఇండియా' యూనిట్. మహానటి తర్వాత కీర్తిసురేష్ నటించిన తెలుగు చిత్రం 'మిస్ ఇండియా'. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కీర్తిసురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వచ్చేనెలలో ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కీర్తిసురేశ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా, నదియా, పూజిత పొన్నాడ, కమల్ కామరాజు తదితరులు ఇందులో నటిస్తున్నారు
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







