వరదల్లో మరణించిన వారి కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేసిన టి.హోం మంత్రి
- October 17, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు చెక్కులు పంపిణీ చేశారు.పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమస్య శాశ్వత పరష్కారానికి కృషి చేస్తున్నా రన్నారు. భారీ వర్షాల తో దాదాపు 12 మంది పాత బస్తి లోని వరదల్లో చనిపోయా రన్నా రు. చనిపోయిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెక్కును పంపిణీ చేశారు. బహదూర్ పుర కు చెందిన అనాస్ బేగం, ఫరా బేగం మరియు కనిజ్ బేగం కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు.. కొంతమంది మరణించిన వారి కుటుంబ సభ్యులు హాజరు కాలేక పోయారు. వారి చెక్కులు MRO కి అప్పగిం చారు.అక్టోబర్ 13 మరియు 14 వ తేది లలోని వర్షాలలో తమ ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని హోం మంత్రి గుర్తు చేశారు.
తాజా వార్తలు
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!







