లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్ 'తిమ్మరుసు'
- October 18, 2020
హైదరాబాద్:'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు' ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్ క్లాప్ కొట్టారు. రాజా, వేదవ్యాస్ స్క్రిప్ట్‌ను అందజేశారు.
ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ నిర్మాత సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'తిమ్మరుసు' చిత్రానికి 'అసైన్‌మెంట్ వాలి' ట్యాగ్‌లైన్.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - " కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. 'తిమ్మరుసు' సినిమా విషయానికి వస్తే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. మంచి టీమ్ కుదిరింది. ఈ నెల 21 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్ చేశాం" అన్నారు.
నటీనటులు:
సత్యదేవ్, ప్రియాంకా ఝావల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్ కోనేరు, సృజన్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
యాక్షన్: రియల్ సతీశ్
పి.ఆర్.ఒ: వంశీకాక
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..