'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రీ టీజర్
- October 19, 2020
అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏపిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. "హాయ్.. ఐయామ్ హర్ష. ఒకబ్బాయి కెరీర్‌లో ఫిఫ్టీ పర్సెంట్ కెరీర్, ఫిప్టీ పర్సెంట్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశాను. ఈ మ్యారీడ్ లైఫే అయ్యయ్యో అంటూ ఒంటి కాలిపై నిలబడే" డైలాగ్‌తో అఖిల్ అక్కినేని ఆకట్టుకున్నారు. టీజర్‌ను అక్టోబర్ 25 ఉదయం 11 గంటల 40 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..