చంద్రుడిపై 4జీ..నాసా కు సాయం అందించనున్న నోకియా
- October 19, 2020
వాషింగ్టన్: చంద్రుడిపై నిలబడి ఆస్ట్రోనాట్లు సెల్ఫీలు దిగితే..? వాటిని అప్పటికప్పుడే ట్విటర్లో అప్లోడ్ చేస్తే..చిన్ని చిన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగలిగితే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.! అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రస్తుతం చేపడుతున్న ప్రయత్నాలు ఫలిస్తే ఈ ఊహలన్నీ త్వరలో నిజం అవుతాయి.
అవును.. చంద్రుడిపై కనెక్టివిటీనీ పెంచేందుకు ప్రముఖ టెక్ సంస్థ నోకియా, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చంద్రుడిపై 4జీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం నాసా ఏకంగా 14.1 మిలియన్ డాలర్లను కేటాయించింది. 4జీతో ప్రారంభించి ఆ తరువాత 5జీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేయాలనేది నాసా ఆలోచన.
ఈ క్రతువులో పాలుపంచుకునేందుకు నోకియాకు చెందిన పరిశోధన విభాగం బెల్ ల్యాబ్స్‌ను కీలక భాగస్వామిగా ఎంపిక చేసింది. టిప్పింగ్ పాయింట్ టెక్నాలజీస్ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలో సమాచార మార్పిడిని మరింత వేగవంతమవుతుందని నాసా పేర్కొంది. దీనిపై బెల్ ల్యాబ్స్ కూడా స్పందించింది. తాము కీలక భాగస్వామిగా ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. చంద్రుడిపై మానవాళి సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు ఈ ప్రయత్నాలు దోహద పడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!