నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌

- February 13, 2016 , by Maagulf
నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌

జపాన్‌-ఆంధ్రా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు యోచన సీఎంతో నరులా జపాన్‌ ఎండీ థర్మీందర్‌ సింగ్‌ భేటీ విజయవాడ, ఏఎనయూ, ఫిబ్రవరి నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇంతవరకు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన జపాన్‌ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నాయి. ఇందుకోసం జపాన్‌-ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ (జేఏబీసీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకొంది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం చంద్రబాబును ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జపాన్‌ (ఐసీసీజే) గౌరవ కార్యదర్శి, నరులా జపాన్‌ ఎండీ థర్మీందర్‌ సింగ్‌ కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే, జపాన్‌ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని, అలాంటి సమస్యలు లేకుండా చూస్తే ఏపీకి అధిక పెట్టుబడులు వస్తాయని థర్మీందర్‌ సూచించారు. ప్రభుత్వం నేరుగా కాకుండా ఇండసీ్ట్ర అసోసియేషన్‌ ద్వారా ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరిపితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఇందుకోసం బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం తరపున ఒకరిని ఓఎస్డీగా నియమించాలని ఆయన సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యతను సీఎంవో కార్యదర్శి సాయిప్రసాద్‌కు అప్పగించారు. కాగా, రాష్ట్రానికి జపాన్‌ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు గతంలో ముఖ్యమంత్రి కూడా ఆ దేశంలో పర్యటించారు. అక్కడి కంపెనీలతో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే థర్మీందర్‌ సింగ్‌ సీఎంను కలిశారు. ప్యాకేజీ అయినా ప్రకటించండి: ఐఈఏ జనరల్‌ సెక్రటరీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యంకాకపోతే ప్రత్యేక ప్యాకేజీనైనా ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని భారత ఆర్థిక సంఘం(ఐఈఏ) జనరల్‌ సెక్రటరి అండ్‌ ట్రెజరర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఠాకూర్‌ కోరారు. ఆంధ్రప్రదేశ ఆర్థిక సంఘం 34వ సమావేశాలు శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com