ఏపీ లో కొత్తగా 3,746 కరోనా పాజిటివ్ కేసులు
- October 21, 2020
ఏపీ:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం 3503 కేసులు నమోదు కాగా, ఈరోజు రిలీజ్ చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కొత్తగా 3746 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,299 కి చేరింది. ఇందులో 32,376 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 7,54,415 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో 27 మంది కరోనా మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 6508కి చేరింది. అనంతపూర్ లో 301, చిత్తూరులో 437, తూర్పు గోదావరిలో 677, గుంటూరులో 396, కడపలో 166, కృష్ణాజిల్లాలో 503, కర్నూల్ లో 65, నెల్లూరులో 116, ప్రకాశం జిల్లాలో 127, శ్రీకాకుళంఓ 167, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 134, పశ్చిమ గోదావరి జిల్లాలో 519 కేసులు నమోదయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!









