'గరం' సినిమా రివ్యూ
- February 14, 2016
యంగ్ హీరో ఆది లేటెస్ట్ ఫిల్మ్ 'గరం'. శుక్రవారం ఈ సినిమా తెలుగురాష్ర్టాల్లో రిలీజ్ అయ్యింది. ఇటు క్లాస్, అటు మాస్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఈ సినిమాలో ఆది ట్రై చేశాడు. గత సినిమాలు 'ప్రేమ కావాలి', 'లవ్లీ' అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని సొంత బ్యానర్లో నిర్మించాడు ఆది.
అలాగే చాలాకాలం తర్వాత డైరెక్టర్ మదన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన గరం సినిమా ప్రేక్షకులకు ఎలాంటి గరం ఇచ్చిందో చూద్దాం..
కథ : బలరాం (తనికెళ్ళ భరణి) తన కొడుకు మంచి ప్రయోజకుడు కావాలని కోరుకున్నప్పటికీ వరాల బాబు (ఆది) మాత్రం చదువు ఎగ్గొట్టి ఆవారాగాడిలా తయారవుతాడు. అయితే, పక్కింట్లో ఉండే మూర్తి (నరేష్) తన కొడుకు రవి (కృష్ణ చైతన్య) మాత్రం బాగా చదువుతుంటాడు. దీంతో వరాల బాబు వాళ్ల నాన్నతో రోజూ తిట్లు తింటుంటాడు. ఒక రోజు విసిగిపోయిన వరాలు గొప్పవాడినవుతానంటూ సిటీకి (హైదరబాద్) వస్తాడు. అక్కడ సమీర(ఆద శర్మ)ని చూసి లవ్ లో పడతాడు. సమీరా ను ప్రేమలో పడేసేందుకు నానా కష్టాలు పడుతుంటాడు. సమీర కూడా తనని ఇష్టపడుతున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఈ క్రమంలో సమీర కి పక్కింటి వాడైన బిజ్జు(కబీర్ దుహన్ సింగ్)తో థ్రెట్ ఉందని తెలుసుకుంటాడు. దీంతో వరాల బాబు ఏం చేసాడు? ఎలా సమీరాను సేవ్ చేసాడు.? అసలు బిజ్జుకి సమీరకి ఉన్న సంబంధాలేమిటి? అనేది సినిమా.
విశ్లేషణ : సినిమాని మొదటి సీన్ నుంచే ఆసక్తికరంగా నడిపించగలిగితే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేయచ్చన్న లాజిక్ తో ముందుకు సాగాడు డైరెక్టర్ మదన్. అయితే, ఈ జోరు మొదటి 30 నిమిషాలు చేయగలిగినా తర్వాత అంతగా ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. లవర్ బాయ్ రోల్స్ లో కనిపించిన ఆది ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించాడు. హీరోయిన్ ఆదాశర్మ తన పరిధిమేరకు అందాలతో మెప్పించింది. ఇంటర్వల్ తర్వాత వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సాగదీతగా మారింది. ఎంటర్టైన్మెంట్ కి కొదవే లేదని ప్రమోట్ చేసుకున్న ఈ సినిమాలో మొదటి 20 నిమిషాల్లో తప్ప మిగతా ఎక్కడా కామెడీ అనేది లేదు. రొటీన్ ఫ్లేవర్ స్టోరీకి కొత్త రంగులు అద్దాలని.. స్పూఫ్ లని, పంచ్ డైలాగ్ ఫార్మాట్ కామెడీ అని.. చాలా చేసినప్పటికీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. పీకే మూవీని అనుకరించి బ్రహ్మానందంతో చేయించిన స్పూఫ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మొత్తానికి గరం గరంగా ఉంటుందేమో అనుకుని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు గరం సినిమా.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







