ఏపీలో కొత్తగా 3,765 కరోనా పాజిటివ్ కేసులు

- October 23, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 3,765 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 80,238 శాంపిల్స్ ను పరీక్షించగా 3,765 మంది కోవిడ్-‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అలాగే కోవిడ్‌ వల్ల గుంటూరులో నలుగురు, కడపలో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, అనంతపూర్‌ లో ఇద్దరు, చితూర్‌ లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కర్నూల్‌ లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు , పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 4,281 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,97,789 పాజిటివ్ కేసు లకు గాను.. 7,59,524 మంది డిశ్చార్జ్ కాగా.. 6,544 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,721 గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com