మస్కట్: బీచ్ లలో జన సంచారంపై కొనసాగనున్న నిషేధం

- October 23, 2020 , by Maagulf
మస్కట్: బీచ్ లలో జన సంచారంపై కొనసాగనున్న నిషేధం

మస్కట్:బీచ్ లలో జన సంచారంపై నిషేధం కొనసాగిస్తున్నట్లు ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా బీచ్ లను రోజంతా మూసివేస్తున్నట్లు ఈ నెల 9న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..రేపటి(శనివారం) నుంచి రాత్రి వేళ మాత్రం జన సంచారంపై నిషేధాన్ని ఎత్తి వేయనున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది. మరోవైపు అన్ లాక్ ప్రక్రియలో భాగంగా విద్యా రంగంపై ఆంక్షలు ఎత్తివేసిన సుప్రీం కమిటీ..నవంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇప్పటికే అనుమతి కూడా ఇచ్చింది. అయితే..కరోనా ముప్పును పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలను పట్టించుకోకుండా నిర్భీతిగా కొందరు వ్యక్తులు ఒక్క చోట పోగవుతున్నారని..ఇది కరోనా వ్యాప్తి తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సమాజ శ్రేయస్సు, ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రతి పౌరుడు, ప్రవాసీయుడు బాధ్యతాయుతంగా మసలుకోవాలని, ఎవరైనా కమిటీ మార్గనిర్దేశకాలను ఉల్లంఘిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిటీ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com