పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలి:వీసీ సజ్జనార్‌

- October 23, 2020 , by Maagulf
పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలి:వీసీ సజ్జనార్‌

సైబరాబాద్‌:పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో (అక్టోబర్ 21, 2020) భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ మరియు సొసైటే ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)  ఆధ్వర్యంలోఈరోజు 400 మందికి పైగా సైబరాబాద్ పోలీస్ సిబ్బంది, వలంటీర్లు, మరియు ప్రజలు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా సైబరాబాద్ సీపీ ఆఫీసుకు కొవ్వొత్తుల ప్రదర్శన/ర్యాలీ చేశారు. అనంతరం సీపీ ఆఫీసు ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద ర్యాలీనీ ముగించి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల స్థపానికి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సైబరాబాద్‌ సీపీ  వీసీ సజ్జనార్‌, ఐపీఎస్., మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితంగానే నేడు సమాజంలోని ప్రజలంతా విద్రోహ శక్తుల బారిన పడకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు.  వారోత్సవాలలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అశువులుబాసిన 264 మంది పోలీసులు త్యాగాలను స్మరించుకుంటూ వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి  తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు  విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు. 

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ఎన్ ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., డిసిపి క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, బాలానగర్ డిసిపి పద్మజా, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు,  ఎస్ఓటీ ఏడిసిపి సందీప్, ట్రాఫిక్ ఏడిసిపి ప్రవీణ్ కుమార్, ఏడిసిపి క్రైమ్స్-I  కవిత, ఏడిసిపి క్రైమ్స్ -II ఇందిరా, ఏడిసిపి క్రైమ్స్ –III రామచంద్రుడు, సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఎస్ డబ్ల్యూ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్ జెపీ, ఏసీపీలు లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, వివిధ ఎన్జీఓలు, ఎస్సీఎస్సీ వలంటీర్లు,  సీపీ ఆఫీసులోని సెక్షన్ల సిబ్బంది, ఆర్ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com