కువైట్: కరోనాతో 10 మంది మృతి..కొత్తగా 812 కేసులు నమోదు
- October 23, 2020
కువైట్ లో కరోనాతో మరో పది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 740కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 812 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కువైట్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,20,232కి పెరిగింది. ఇందులో 1,11,440 మంది కోలుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా సోకి 8,052 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 122 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 7,853 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, ఇప్పటివరకు 8,65,560 మందికి టెస్టులు జరిపినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







