భారత్ లో 78 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

- October 24, 2020 , by Maagulf
భారత్ లో 78 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ:భారత్ లో గత 24 గంటల్లో  53,370 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 650 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,17,956కు చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, దేశంలో 89.78 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71  శాతం ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 12,69,479 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,13,82,564. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు  6,80,680 ఉండగా, చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయనవారి సంఖ్య  70,16,046గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com