కువైట్ ఆరోగ్య శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ

- October 24, 2020 , by Maagulf
కువైట్ ఆరోగ్య శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ

కువైట్ సిటీ:కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. బాసెల్ హమౌద్ అల్ హమద్ అల్ సబా తో భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కువైట్-భారత్ మధ్య వైద్య రంగంలో పరస్పర సహకారాన్ని, ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. కోవిడ్ 19 ఎదుర్కునేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకారంపై చర్చించారు. వైద్య రంగ నిపుణుల సహాయం, వైద్యపరంగా సాంకేతిక సాయం ఇచ్చిపుచ్చుకునే అంశంపై డిస్కస్ చేశారు. అలాగే కోవిడ్ నుంచి సంరక్షించుకునేందుకు ఇండియాలో వ్యాక్సిన్ తయారీ, వాటి ఉపయోగం, ఉత్పత్తిపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com