33 డెస్టినేషన్స్‌కి సౌదియా విమానాల పునరుద్ధరణ

- October 24, 2020 , by Maagulf
33 డెస్టినేషన్స్‌కి సౌదియా విమానాల పునరుద్ధరణ

రియాద్:సౌదీ నేషనల్‌ క్యారియర్‌ సౌదియా, 33 డెస్టినేషన్స్‌కి నవంబర్ ‌లో విమానాల్ని పునరుద్ధరించనుంది. దేశంలో ఇటీవల పాక్షికంగా విమానాల పునరుద్ధరణ జరగ్గా, నెల రోజుల తర్వాత ఆయా డెస్టినేషన్లకు విమాన సర్వీసుల్ని పునరుద్ధరించనున్నారు. ఆసియాలోని ముంబై, ఢిల్లీ, కోచి సహా లాహోర్‌, ఢాకా, ఇస్లామాబాద్‌, సకార్తా, కరాచీ తదితర ప్రాంతాలకు ఈ విమానాలు నడుస్తాయి. అబుదాబీ, బహ్రెయిన్‌, కువైట్‌ బీచట్‌ మరియు దుబాయ్‌ అలాగే ఒమన్‌లకు కూడా విమానాల్ని సౌదియా పునరుద్ధరించనుంది. ఆఫ్రికా విషయానికొస్తే, అబాదా, కైరో, అలెగ్జాండ్రియా, నైరోబీ తదితర ప్రాంతాలకు విమానాల్ని నడుపుతారు. ప్రయాణీకులు, ట్రావెల్‌ ప్రికాషన్స్‌ని పాటించాలని సౌదియా కోరుతోంది. మార్చిలో సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల్ని రద్దు చేసిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com