దుబాయ్‌ సూపర్‌ మార్కెట్‌కి జరీమానా

- October 24, 2020 , by Maagulf
దుబాయ్‌ సూపర్‌ మార్కెట్‌కి జరీమానా

దుబాయ్‌:ఓ సూపర్‌ మార్కెట్‌ సహా మొత్తం మూడు బిజినెస్‌లపై అధికారులు జరీమానా విధించారు. ఫిజికల్‌ డిస్టెన్సింగ్‌ రూల్స్‌ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు అధికారులు. దుబాయ్‌ ఎకానమీ వెల్లడించిన వివరాల ప్రకారం టెక్స్‌టైల్‌ అండ్‌ ఫాబ్రిక్‌ ట్రేడింగ్‌ సంస్థ, కన్స్యుమర్‌ కాంప్లెక్స్‌ మరో షాప్‌ని ఉల్లంఘనల నిమిత్తం గుర్తించినట్లు తెలుస్తోంది. హర్మియా మరియు సిక్కత్‌ అల్‌ ఖయిల్‌ ప్రాంతంలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. మొత్తం 150 ఎస్టాబ్లిష్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 147 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో అన్ని నిబంధనల్నీ పాటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com