కనీస వేతనమడిగితే... ఉద్యోగాలకే ఎసరు ?

- February 14, 2016 , by Maagulf
కనీస వేతనమడిగితే... ఉద్యోగాలకే ఎసరు ?

 కనీస వేతనాలు అమలు పర్చమని భారత్ కోరడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్మిక విపణిలో పలు కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యపడదని కినుక వహిస్తున్నాయి. నూతన యు.ఎ.ఇ.కార్మిక చట్ట ప్రకారం విదేశీయులకు పని అనుమతి ఇచ్చేముందు యజమానితో పని ఒప్పందం సంతకం చేయాల్సిఉంది అయెతే..యు.ఎ.ఇ. నైపుణ్యం కల్గిన కార్మికులకు సైతం కనీస వేతనాల అమలు గూర్చి ప్రస్తావించలేదు. ఈ లోపాన్ని సాకుగా తీసుకొని యు.ఎ.ఇ. పలు కంపెనీల యాజమాన్యాలు నేరుగా భారత్ ప్రభుత్వాన్ని సంప్రదించి నైపుణ్యమున్న కార్మికులను తమకు కావాలని కోరుతుంది. ఈ విధంగా భర్తీ చేసుకొన్న వెళ  ప్రకటించిన వేతనం కంటే తక్కువ జీతాన్ని కార్మికులకు  ఇవ్వడం భరత్ ప్రభుత్వం గమనించింది. యు.ఎ.ఇ.లో పలు కంపెనీలు తక్కువ జీతంకు భారత్ కార్మికులను పని ఒప్పందం కుడుర్చుకొంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్మిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చేనట్లే భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందేమోనని యాజమాన్యాలు ఆశించాయి. ఈ పరిస్థితులలో భారత కార్మికులకు కనీస వేతనాలు అమలు పర్చమని భారత్ కోరడంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం, యు.ఎ.ఇ. కంపెనీ యాజమాన్యాల మధ్య వేతనాల ఘర్షణ కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com