IPL ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్
- October 26, 2020
యూఏఈ:ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ ప్రకటించారు. ఇంతకు ముందు లీగ్ మ్యాచ్ ల షెడ్యూల్ మాత్రమె ఇచ్చారు. ఇక లీగ్ దశ చివరికి వస్తుండడంతో ఇప్పుడు ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ వెల్లడించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)బీసిసిఐ). నవంబర్ 3 తొ లీగ్ దశలోని మ్యాచ్ లు ముగుస్తాయి. నవంబర్ 4వ తేదీన విశ్రాంతి దినం. ఇక నవంబర్5 తేదీన క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా తొలి క్వాలిఫయర్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్-1, టాప్-2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరుగనుంది. Also Read - IPL 2020: ఐపీఎల్‌కి ధోనీ గుడ్‌బై !? నెట్టింట ప్రశ్నల వెల్లువ అబుదాబి వేదికగా నవంబర్ 6వ తేదీ ఎలిమినేటర్ మ్యాచ్ టీమ్-3, టీమ్-4 జట్ల మధ్య జరుగనుంది. ఇక్కడే నవంబర్ 8వ తేదీన క్వాలిఫయర్-2 జరుగనుంది. క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. ఐపీఎల్-13 సీజన్ తుది పోరు దుబాయ్ వేదికగా క్వాలిఫయర్-1లో విజేత, క్వాలిఫయర్-2లో గెలిచిన జట్ల మధ్య జరుగుతుంది. మ్యాచ్‌లన్నీ రాత్రి గం. 7.30ని.లకు ప్రారంభమవుతాయి. మహిళల టీ20 చాలెంజ్‌కు షార్జాను వేదికగా ఖరారు చేయడంతో ఇక్కడ ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు.
ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్ కు కచ్చితంగా వెళుతుందని అందరూ భావించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యువ ఆటగాళ్ళ జోరు తొ అనూహ్యంగా మ్యాచ్ లు సాగుతున్నాయి. నాలుగు మ్యాచ్ లు సూపర్ ఓవర్ వరకూ వెళ్ళాయి. చలా మ్యాచ్ లు చివరి ఓవర్ వరకూ ఫలితం కోసం ఉత్కంఠతో ఎదురు చూసేలా చేశాయి.


తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







