ట్వంటీ20లో భారత్ విజయం
- February 14, 2016
మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో జరిగిన మూడో ట్వంటీ20లో 83 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 46, రెహానే 22 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 13 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఈ విజయంతో భారత్ 2-1 స్కోరుతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలు బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు కోసం యత్నించి 82 పరుగులకే ఆలౌటైంది. దిల్షాన్ 1, డిక్వెల్లా 1, చండీమల్ 8, గుణరత్నే 4, పెరెరా 12, సేనానాయకే 8, సిరివర్ధన 4, శనక 19, ప్రసన్న 9, చమీర 9, ఫెర్నాండో ఒక పరుగు చేశారు.
పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ సిరీస్ కూడా దక్కింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దిల్షాన్, డిక్వెల్లా, చండీమల్, గుణరత్నేలను అశ్విన్ అవుట్ చేశాడు.
భారత్‌తో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక 13 పరుగులకే మూడు వికెట్లో కోల్పోయింది. చండీమాల్ 8 పరుగుల స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో మూడో వికెట్‌గా అవుటయ్యాడు. డిక్వెల్లా, దిల్షాన్ చెరో వికెట్ తీసి అవుటయ్యారు. ఈ మూడు వికెట్లు కూడా అశ్విన్ తీశాడు.
శ్రీలంక 20 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగులోని గుణరత్నే 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. శ్రీలంక 21 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. సిరివర్ధనే నాలుగు పరులుగు చేసి నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు.
కీలకమైన మూడో ట్వంటీ20 మ్యాచులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆదివారం విశాఖపట్నంలో మూడో వన్డేకు మార్పులేమీ లేకుండా భారత్ బరిలోకి దిగింది. తాము 160 పరుగులు చేస్తే భారత్‌ను పోటీ ఇవ్వగలమని శ్రీలంక కెప్టెన్ చండీమాల్ అన్నాడు.
శ్రీలంక మూడు మార్పు చేసింది. కాపుగెదర గాయపడడంతో ఆడడం లేదు. దిల్హర, డిక్వెల్ల తుది జట్టులోకి వచ్చారు. అసెలా తన తొలి టీ20 మ్యాచు ఆడుతున్నాడు. మూడు టీ20 సిరీస్‌లో శ్రీలంక, భారత్ చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో మూడో వన్డే కీలకమైంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







