G-Pay వినియోగదారులకు యాపిల్ షాక్..
- October 27, 2020
వినియోగదారులు నగదు చెల్లింపులు చేయడంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ యాప్‌ను తాత్కాలికంగా యాప్ స్టోర్ నుంచి యాపిల్ తొలగించింది. గూగుల్ పే కోసం సెర్చ్ చేసిన వారికి ఆ యాప్ కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఫోన్ పే, పేటీయం, భీమ్ యూపీఐ వంటి యాప్స్ ప్రస్తుతం కనబడుతున్నాయి. యాప్ స్టోర్ నుంచి గూగుల్ కనబడకుండా పోవడం ఇదే మొదటి సారి. ఈ సంవత్సరం ఆగస్టులో ప్లే స్టోర్ నుంచి ఆఫ్ లైన్‌కు గూగుల్ పే వెళ్లింది.
ఈ విషయంపై స్పందించిన గూగుల్ ప్రతినిధి ఒకరు దీన్ని సరిచేయడానికి తమ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్రస్తుతం ఎలాంటి అసౌకర్యం లేదు. ఈ యాప్ ఇప్పటికే ఇన్ స్టాల్ అయి ఉన్న ఐఫోన్లలో పని చేస్తూనే ఉంది. దాన్ని యాపిల్ అన్ ఇన్ స్టాల్ చేయలేదు. కానీ ప్రస్తుతం దాన్నుంచి అక్కడ లావాదేవీలు జరగట్లేదు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు వేరే యాప్స్ వాడుకోవడమే.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







