కొనసాగుతోన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరసన దీక్ష

- October 27, 2020 , by Maagulf
కొనసాగుతోన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరసన దీక్ష

కరీంనగర్:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరసన దీక్ష కొనసాగుతోంది. దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్‌ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన దీక్షతో పరిస్థితులు ఇంకాస్థ ఉద్రిక్తంగా మారింది. సీపీని బదిలీ చేసి కేసు నమోదు చేసేవరకు తాను దీక్ష విరిమించేదే లేదు అంటున్నారు. ఉదయం నుంచే బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు అంతా బండి సంజయ్‌ దీక్ష చేస్తున్న ప్రదేశానికి చేరుకొనే ప్రయత్నం చేయడం.. అదే సమయంలో బీజేపీ నేతల హౌస్‌ అరెస్టులతో పరిస్థితి రణరంగంగా మారింది.. నిన్నటి నుంచి జరుగుతున్న ఇష్యూలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.. కొన్ని చోట్ల సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మలు సైతం దహనం చేశారు.. మరోవైపు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com