దోహాలో 'దసరా' వేడుకలు

- October 31, 2020 , by Maagulf
దోహాలో \'దసరా\' వేడుకలు

దోహా:దోహా లోని అల్ దోసారి జూ అండ్ గేమ్ రిజర్వు లో 30-10-2020 నాడు ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్నారు.తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖతార్ లో మొదటి సారిగా దసరా సంబరాలు జరుపుకున్నారు.అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ మాట్లాడుతూ కరోనా కారణంగా మినిస్ట్రీ అఫ్ పబ్లిక్ హెల్త్ నుండి వచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ మొదట కార్యక్రమం జరిగే స్థలాన్ని శానిటైజ్ చేసి మరియు మాస్క్ ధరించి, శానిటైజర్ మరియు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ గ్రూపులు గా పిల్లలకు మరియు ఫామిలీస్ కు గేమ్స్  కండక్ట్ చేయడం జరిగింది. 

తెలంగాణ సంప్రదాయం ఉట్టి పడేలా భోజనం ఏంర్పాటు చెయ్యడం జరిగింది.
అందరూ జమ్మి ఆకును ఇచ్చి పుచ్చు కొని దసరా జరుపుకోడం జరిగింది.
పిల్లలకు మరియు పెద్దలకు ప్రత్యేక ఆటలా పోటీలు నిర్వహించారం జరిగింది. 
ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి గా ఐ సి బి ప్ ప్రతినిధి మేడం రజని మూర్తి  మరియు ఐ సి సి ప్రతినిధి పడాల భూమేష్ విజేతలకు బహుమతులు అందచేసారు
మరియు వారు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున దసరా సంబరాలు జరగడం దోహాలో మొదటి సారి అని కొనియాడారు.
ఈ కార్య క్రమములో కార్య వర్గ సభ్యులు వెంకట సౌజన్య , స్రవంతి, మహమ్మద్ రవూఫ్ , నాగరాజు, గులాం రసూల్, నవీద్,షోయబ్, రమేష్ నేతాజీ, సుధాకర్, శివ కృష్ణ, సలావుద్దీన్ , రమేష్ పిట్ల, కృష్ణ, అనీష్ మరియు రాజు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com