వాహనం దొంగతనం: గ్యాంగ్‌ అరెస్ట్‌

- November 03, 2020 , by Maagulf
వాహనం దొంగతనం: గ్యాంగ్‌ అరెస్ట్‌

కువైట్ సిటీ:ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాహనాల దొంగతనాలకు ఈ గ్యాంగ్‌ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాహన దొంగతనంకి సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నిందితుల్ని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్‌ చేశారు. పలు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు విచారణ సందర్భంగా అంగీకరించారు. కాగా, ఈ గ్యాంగ్‌ దొంగతనాలు చేసిన వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com