రాజశేఖర్ కోలుకుంటున్నారు: జీవిత
- November 04, 2020
కరోనా బారిన పడిన నటుడు రాజశేఖర్ సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నటుడి భార్య జీవిత మాట్లాడుతూ రాజశేఖర్ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉందని ఓ వీడియోలో పేర్కొన్నారు. ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. అయితే ఆయన వెంటలేటర్‌పై ఉన్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన్ని ఎప్పుడూ వెంటిలేటర్‌పై ఉంచలేదని జీవిత పేర్కొన్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని వివరించారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నట్లు డాక్టర్లు వివరించారని అన్నారు. అభిమానులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞలు తెలియజేశారు. వారు చేసిన ప్రార్థనలు ఫలించి ఆయన కోలుకుంటున్నారని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







