చింత చిగురు బిర్యాని
- February 15, 2016
కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం - ఒకటిన్నర కప్పులు, చింతచిగురు - అరకప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 5, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 6 రేకలు, పచ్చికొబ్బరి ముక్క - పావు చిప్ప, సోంపు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, మసాలా దినుసులు (లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యాని ఆకు) - తగినన్ని.
తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చిగురుని టీ స్పూను నూనెలో దోరగా వేగించి, కొద్ది నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి. మిక్సీలో పావుకప్పు ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, సోంపు, అర టీ స్పూను జీలకర్ర మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో మసాలా దినుసులు, మిగిలిన జీలకర్ర, ఉల్లి తరుగు, ఉల్లి మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఉల్లి ముద్ద పచ్చివాసన పోయాక చింతచిగురు కలపాలి. రెండు నిమిషాల తర్వాత (3 గంటలు నానబెట్టిన) బియ్యం కలిపి రెండున్నర కప్పుల నీరు పోసి ఉడికించాలి. అన్నంతో కలిసిన చింతచిగురు రుచికరమైన బిర్యానిగా సిద్ధమపోతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









