వాట్సాప్‌లో కొత్త ఫీచర్
- November 05, 2020
న్యూఢిల్లీ: వాట్సాప్ యూజర్లకు కొత్త అప్డేట్ రాబోతోంది. ఈ యాప్‌లో 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుంటే వ్యక్తిగత చాట్‌తోపాటు గ్రూప్ చాట్స్‌లో ఏడు రోజుల తర్వాత మెసేజులు వాటంతటవే డిలీట్ అయిపోతాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ బేస్డ్ కైఓఎస్ డివైజెస్‌తోపాటు వాట్సాప్ వెబ్, డెస్క్‌టాఫ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ నెలాఖరుకల్లా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. టెలిగ్రామ్‌తో పోల్చుకుంటే వాట్సాప్‌లో డిసప్పియరింగ్ ఫీచర్ కాస్త వైవిధ్యంగా ఉండనుంది.
టెలిగ్రామ్‌లో మెసేజులు ఎప్పుడు డిలీట్ అవ్వాలనే ఆప్షన్లో గంటలు, రోజుల పరిమితి ఉంటుంది. కానీ వాట్సాప్‌లో 7 రోజుల డిసప్పియర్ పీరియడ్ మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 'మేం ఏడు రోజుల పీరియడ్‌తో దీన్ని మొదలుపెడుతున్నాం. ఎందుకంటే తమ సంభాషణలు శాశ్వతం కాదని యూజర్లకు తెలియాలి. దీంతో వాళ్లు తాము ఏం చాటింగ్ చేయాలనే దానిపై స్పష్టతతో ఉంటారు.
మీరు వెతికే స్టోర్ అడ్రస్, షాపింగ్ లిస్ట్ మీకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది' అని వాట్సాప్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను అన్ని చాట్ విండోలకు ఒకేసారి ఎనేబుల్ చేయలేం. ఏ చాట్ విండోకు ఫీచర్ కావాలనుకుంటే ఆ చాట్‌లో ఎనేబుల్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







