ఒమన్ ఎయిర్ పోర్టుకు 5 స్టార్ రేటింగ్..
- November 06, 2020
మస్కట్:ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఒమన్ ఎయిర్ పోర్టుకు 5 స్టార్ రేటింగ్ దక్కింది. బ్రిటీష్ సెఫ్టీ కౌన్సిల్ కు చెందిన హెల్త్ అండ్ సెఫ్టీ..కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని పలు విమానాశ్రయాలు ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన జాగ్రత్త చర్యలను విశ్లేషించి రేటింగ్ లను ఖరారు చేసింది. ఒమన్ లోని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం మహమ్మారి ప్రబలిన నాటి నుంచి ప్రయాణికుల సెఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు బ్రిటిష్ సెఫ్టీ కౌన్సిల్ పేర్కొంది. ఆక్టోబర్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ కు అనుమతించిన ఒమన్...సుల్తానేట్ పరిధిలోని అన్ని విమానాశ్రయాల్లో పకడ్బందీగా కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టింది. విమానాశ్రయం శానిటైజ్ నుంచి మొదలు ఎయిర్ పోర్టు స్టాఫ్, ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రధాన్యతను ఇచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు క్వారంటైన్ నిబంధనలు సవరిస్తూ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసింది. దీంతో గత నెలలోనే మస్కట్ ఇంటర్నరేషన్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి నుంచి ఎయిర్ పోర్ట్ హెల్త్ అక్రిడేషన్ సర్టిఫికెట్ కూడా దక్కింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏసీఐ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి విమానాశ్రయంగా మస్కట్ గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









