సౌదీ: హద్దు దాటిన వాహనదారులకు ఇక వాయింపే..

- November 06, 2020 , by Maagulf
సౌదీ: హద్దు దాటిన వాహనదారులకు ఇక వాయింపే..

సౌదీ అరేబియా:నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేసే వాహనదారులను కట్టడి చేసేందుకు త్వరలోనే ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది సౌదీ ప్రభుత్వం. ఇక రోడ్లపై ముందస్తు సిగ్నల్ ఇవ్వకుండా ఇస్టానుసారంగా లేన్లు మార్చుతూ డ్రైవింగ్ చేసే వాహనాలను ఈ ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పసిగట్టవచ్చు. ఈ సిస్టంను ముందుగా రియాద్, దమ్మమ్, జెడ్డా నగరాల్లో అమలు చేయనున్నారు. వచ్చే వారం రోజుల్లోనే మానిటరింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో వాహనాల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. రహదారులపై ప్రమాదాల నియంత్రణను దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com